
* నిందితుల్లో ఏఆర్ కానిస్టేబుల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ కూకట్పల్లిలో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశామని, రూ .కోటి విలువైన డ్రగ్స్ (DRUGS)ను సీజ్ చేశామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిందితుల్లో ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ఉన్నారని తెలిపారు. కానిస్టేబుల్, ఏ2 సురేంద్ర స్నేహితులని వెల్లడించారు. గుంటూరు (GUNTUR) నుంచి హైదరాబాద్ (HYDERABAD) కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని అన్నారు. బెంగళూరుకు చెందిన అప్పన్న, కానిస్టేబుల్ గుణశేఖర్ కోసం గాలిస్తున్నామన్నారు. కుత్బుల్లాపూర్ మండలం బాలనగర్ డిసిపి కార్యాలయంలో ఎస్ఒటి పోలీసులు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా అద్దంకి చెందిన ఐదుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. డ్రగ్ పెడ్లర్ల నుంచి 820 గ్రాముల ఎపిడ్రిన్ తో కూడిన కొకైన్, ఒక డిజిటల్ వెయిట్ మిషన్, ఐదు చరవాణీలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ దందాలో ప్రధాన నిందుతుడు తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణ శేఖర్(40) ఉన్నట్లు గుర్తించామని ఎస్ఒటి పోలీసులు వివరించారు. ఏడుగురు సభ్యుల ముఠాలో ప్రస్తుతం పరారీలో ఉన్న కానిస్టేబుల్ గుణ శేఖర్ తో పాటు మరో వ్యక్తి అప్పన్న ఉన్నట్టు గుర్తించామన్నారు.
…………………………………………