
* జూన్ 6న ఎస్సార్ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సం
* సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణికి గౌరవ డాక్టరేట్ ప్రదానం
ఆకేరున్యూస్, హనుమకొండ : ఎస్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సన్నాహాలు చేస్తోంది. జూన్ 6న 3వ స్నాతకోత్సం నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ దీపక్ తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చాన్స్లర్ తో పాటు డా. వి. మహేష్; రిజిస్ట్రార్ డా. ఆర్. అర్చనా రెడ్డి; మరియు స్నాతకోత్సవ ప్రణాళికలో పాలుపంచుకున్న కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారు (క్యాబినెట్ ర్యాంక్) . ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డా. జి. సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. డా. రెడ్డి రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం మాజీ కార్యదర్శిగా; డీఆర్డీఓ మాజీ ఛైర్మన్గా; మరియు రక్షణ శాఖ మంత్రికి మాజీ శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. అలాగే స్నాతకోత్పసంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్
ఎంఎం కీరవాణికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
2020లో ప్రైవేట్ యూనివర్సిటీగా స్థాపించబడిన ఎస్ఆర్ యూనివర్సిటీ విద్యా నైపుణ్యం, పరిశోధన ఆవిష్కరణలలో అగ్రగామిగా నిలిచింది. గతంలో ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ (2002లో స్థాపించబడింది) గా గుర్తింపు పొందిన ఈ యూనివర్సిటీ, నాక్ (NAAC), ఎన్బీఏ (NBA), యూజీసీ (UGC) నుండి ప్రతిష్టాత్మక గుర్తింపులను పొంది, 23 సంవత్సరాల గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. ఎస్ఆర్ యూనివర్సిటీ సాధించిన ముఖ్య విజయాలలో ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) 2024 ర్యాంకింగ్స్లో 98వ స్థానం సాధించడం, గత మూడు సంవత్సరాలుగా భారతదేశంలోని టాప్ 100 సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ (ARIIA) 2020లో యూనివర్సిటీ నెం.1 ప్రైవేట్ సంస్థగా ర్యాంక్ పొందింది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ (THE) ఇంటర్డిసిప్లినరీ సైన్స్ ర్యాంకింగ్స్ 2025లో, ఎస్ఆర్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా 401–500 బ్యాండ్లో, భారతదేశం నుండి కేవలం 65 సంస్థలలో ఒకటిగా నిలిచింది. టీహెచ్ఈ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2024లో, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ (SDG 8) లో భారతదేశంలో 2వ స్థానం, రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ (SDG 12) లో 16వ స్థానం, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ (SDG 7) లో 47వ స్థానం, మరియు క్వాలిటీ ఎడ్యుకేషన్ (SDG 4) లో 60వ స్థానం సాధించింది. యూఐ గ్రీన్మెట్రిక్ ర్యాంకింగ్స్ 2024లో, తన సుస్థిరత కార్యక్రమాలకు గాను యూనివర్సిటీ భారతదేశంలో 25వ స్థానం మరియు ప్రపంచవ్యాప్తంగా 743వ స్థానం పొందింది. తెలంగాణలో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ స్థాపించిన మొదటి ప్రైవేట్ యూనివర్సిటీ కూడా ఎస్ఆర్ యూనివర్సిటీనే, ఇది 110కి పైగా స్టార్టప్లకు మద్దతు ఇచ్చింది. ఈ సంస్థ ₹51 లక్షల అత్యధిక వార్షిక ప్లేస్మెంట్ ప్యాకేజీని కలిగి ఉంది జప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థలు మరియు పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలను (MoUs) కలిగి ఉంది.
……………………………………………………