
* చౌటుప్పల్లో ఇద్దరు దుర్మరణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ట్రావెల్ బస్సు బ్రేకులు ఫెయిలు కావడంతో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద హైదరాబాద్- విజయవాడ (Hyderabad-Vijayawada)జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. బస్సు బ్రేక్ డౌన్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తో పాటు ఓ ప్రయాణికురాలు మృతి చెందారు. మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న సమయంలో ఘటన జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
……………………………………….