
* ఇథనాల్ పరిశ్రమపై రైతుల కన్నెర్ర
* కంపెనీని వ్యతిరేకిస్తూ ఆందోళన.. కార్లకు నిప్పు
ఆకేరు న్యూస్, గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ లో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ ప్రాంతంలో ఇథనాల్ (Ithanal Factory) పరిశ్రమను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కొంత కాలంగా 12 గ్రామాల ప్రజలు పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం గాయత్రి కంపెనీ వారు పరిశ్రమ ఏర్పాటుకు కూలీలను తీసుకొచ్చారు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 10 గ్రామాలకు చెందిన ప్రజలు ఊహించని రీతిలో పెద్ద ధన్వాడ(Dhanwada)లో ఫ్యాక్టరీ నిర్మించ తలపెట్టిన ప్రాంతానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కంపెనీకి చెందిన కార్లకు నిప్పు పెట్టారు. పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై తిరగబడ్డారు.అక్కడ వారు వేసుకున్న టెంట్లను తొలగించి సామగ్రిని ధ్వంసం చేశారు. అలాగే అక్కడున్న కూలీలను రాళ్లతో తరిమికొట్టారు. వారిని అడ్డుకోవడానికి భారీగా పోలీసులు మోహరించారు.
…………………………………………………………….