
* పేదల సంక్షేమమే మా విధానం
* ఎక్స్ లో ప్రధాని పోస్ట్
ఆకేరు న్యూస్, డెస్క్ : పేదల సంక్షేమం కోసమే కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (Nda government) ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన కోసం విప్లవాత్మకమైన చర్యలు తీసుకుందని, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక పథకాలన్నీ పేదల జీవితాలను మార్చాయన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు గృహనిర్మాణం, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచాయని పేర్కొన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల, డీబీటీ, డిజిటల్ విప్లవం వంటివి ప్రతి ఒక్కరికి చేరేలా పథకాలను తీసుకొచ్చామన్నారు.
……………………………………………………..