
* అగ్ర నేత సుధాకర్ ఎన్కౌంటర్
ఆకేరున్యూస్, చత్తీస్ఘడ్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటన మరువకముందే.. మరో అగ్రనేత ఎన్కౌంటర్లో మృతిచెందారు. చతీస్గడ్ ` బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో డిఆర్జి మరియు ఎస్టిఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లో భద్రత బలగాలకు మరియు మావోయిస్టులకు భారీ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పులో మావోయిస్టు అగ్రనేత సోమన్న (64) మరణించారు. చనిపోయిన మావోయిస్ట్ సోమన్న సెంట్రల్ కమిటీ మెంబర్ టెన్త్ లక్ష్మీనరసింహచలం అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్ అలియాస్ ఆనంద్ అలియాస్ సోమన్న తండ్రి రామకృష్ణ నాయుడు కొప్పుల వెలమ బిసి ప్రగడవరం విలేజ్ చింతలపూడి వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మీటింగ్ ఏర్పాటు చేశారని పోలీసులకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహించారు. భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు విస్తృతంగా ఎదురు కాల్పులు జరిపినట్లు సమాచారం.
……………………………………….