
* రాజ్యసభ సీటును ఎంఎన్ఎంకు కేటాయించిన డీఎంకె
* నామినేషన్ దాఖలు చేసిన కమల్ హాసన్
ఆకేరున్యూస్ డెస్క్: తనదైన శైలితో యావత్ భారత దేశంలో గుర్తింపు పొంది నటనలో తనకు ఎవరూ సాటి రారని నిరూపించిన కమల్ హాసన్ రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ముందుకు పోతున్న విషయం తెల్సిందే.. మక్కల్ నీది మయ్యం పేరుతో తమిళనాడులో ప్రాంతీయ పార్టీని స్థాపించిన కమల్ హాసన్ గత ఎన్నికల్లో ఆశించినంతగా ఫలితాలు సాధించలేక పోయారు. రైటిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ఉండే కమల్ సెక్యులర్ సిద్ధాంతాలపై పార్టీని నడిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికార డీఎంకేకు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడులో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని అధికార డీఎంకే పార్టీ కమల్ కు కేటాయించింది. ఈ నేపధ్యంలో కమల్ హాసన్ రా జ్యసభకు శుక్రవారంనాడు నామినేషన్ వేశారు. తమిళనాడు సెక్రటేరియట్లో ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. భాగస్వామ్య పార్టీల నేతలు వీసీకే చీఫ్ తిరుమావలన్, ఎండీఎంకే చీఫ్ వైకో, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగై సైతం పాల్గొన్నారు కమల్ కాకుండా మరో ముగ్గురు అభ్యర్థులను డీఎంకే నిలబెట్టింది. కవి, తమిళ అధికార భాషా కమిషన్ మాజీ చైర్పర్సన్ సల్మా, సీనియర్ అడ్వకేట్ పి.విల్సన్, మాజీ మంత్రి ఎస్.ఆర్.శివలింగంనుు తమ అభ్యర్థులుగా డీఎంకే ప్రకటించింది. జూన్ 19 రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి.
…………………………………………