
ఆకేరున్యూస్, వరంగల్: నిజాయితీగా ప్రజలకు సేవాలందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయపర్తి పోలీస్‌స్టేషన్ నూతన ఎస్ఐగా నేడు భాధ్యతలు చేపట్టిన యం.రాజేందర్ శుక్రవారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పూలమొక్కను అందజేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించే విధంగా విధులు నిర్వహించాలని సీపీ నూతన ఎస్ఐకి తెలిపారు.
………………………………….