
* మూడో రోజూ కొనసాగిన కాల్పులు
* ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావో కీలక నేతలు మృతి
ఆకేరు న్యూస్ డెస్క్: చత్తీస్ ఘడ్ లోని దండకారాణ్య ప్రాంతం గత మూడు రోజులుగా తుపాకీ
మోతలతో దద్ధరిల్లుతోంది.. కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్లో భాగంగా
చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గత మూడు రోజులుగా
కేంద్ర భద్రతా దళాలకు మావోలకు మధ్య భీకరంగా ఎదురుకాల్పులు
జరుగుతున్నాయి.గత రెండు రోజుల్లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్ . భాస్కర్ లు
మృతి చెందారు కాగా మూడో రోజు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు అగ్ర నేతలు మృతి చెందారు. మృతి చెందిన వారి వివరాలు తెలియరాలేదు. భద్రతా దళాలకు ఘటనా స్థలం వద్ద పెద్ద ఎత్తున ఆటోమెటిక్ ఆయుధాలు పేలుడు పదార్థాలు దొరికినట్లు సమాచారం
……………………………………………………