
* మహిళా ఎస్సైపై దాడి
ఆకేరు న్యూస్ , ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయి ప్రవర్తించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సైపై దాడి చేశారు. కల్లూరు ప్రాంతంలో ఓ హోటల్ వద్ద తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలకు హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో ఇరు వర్గాలకు సర్ది చెప్పడానికి వచ్చిన మహిళా ఎస్సైపై కాంగ్రెస్ నాయకులు దురుసుగా ప్రవర్తించి ఆమెను నెట్టి వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకోగా పోలీసులు వెంటనే దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
…………………………………………………..