
* పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఒక బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టు కుంగినట్లు చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ భవన్లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా, 85 పియర్లుగా నియమించారని వివరించారు. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట రూపకల్పన చేశారని తెలిపారు. తమ్మిడి హట్టి వద్ద నీళ్లు తక్కువగా ఉంటాయని, ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చామని తెలిపారు. కాళేశ్వరం లేకుండా పంటలు పండాయని కాంగ్రెస్ చెబుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) కు 3 వనరుల ద్వారా నీటి లభ్యత ఉందని అందుకే పంటలు పండాయని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా వేలాది ప్రాజెక్టులను నింపొచ్చన్నారు. కాళేశ్వరం వల్లనే యాసంగిలోనూ పంటలు పండాయని వివరించారు. మొత్తం కాళేశ్వరం ద్వారా 20.33 లక్షల ఎకరాలకు నీళ్లిచామని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీశ్‌రావు వివరించారు.
………………………………………