
* కవిత చెప్పింది జరుగుతోంది..
* హరీశ్‌రావుతో ఈటల సమావేశం దేనికి సంకేతం?
* కాళేశ్వరం కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం అన్నారు..
నేడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు
* ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీలోకి బీఆర్ ఎస్ విలీనం ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (ADI SRINIVAS) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు, ఈటల రాజేందర్ సమావేశం దేనికి సంకేతామో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ (BJP) నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ-బీఆర్ ఎస్ (BRS) బంధానికి ఇదే నిదర్శనమని వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎం అని పదే పదే చెప్పిన బీజేపీ నేతలు.. ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ(MODI), కేంద్ర మంత్రులు ఎన్నోసార్లు మాట్లాడారని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా వ్యాఖ్యలను ఈటల వ్యతిరేకిస్తారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లు బీజేపీలో బీఆర్ ఎస్ విలీనం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ ఎస్ కలిపి కాంగ్రెస్‌ను దొంగ దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయని ఎన్నో సార్లు చెప్పామన్నారు. బీఆర్ ఎస్ అవినీతిని బీజేపీ ఎందుకు సమర్తిస్తుందో చెప్పాలన్నారు.
…………………………………………………….