
* ప్రమాదానికి గురైన స్క్రాప్ దుకాణం
ఆకేరు న్యూస్ ,జగిత్యాల : జగిత్యాల సమీపంలోని దరూర్ లో స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. స్క్రాప్ దుకాణం పక్కనే శ్మశానం ఉండడంతో శ్మశానంలో శవాన్ని కాలుస్తుండగా అందులోనుంచి నిప్పురవ్వలు వెలుపడి పక్కనే ఉన్న దుకాణంలో డంపింగ్ చేయబడి ఉన్న స్క్రాప్ పై పడ్డాయి.. నిప్పు రవ్వలు పడగానే స్క్రాప్ మొత్తం మంటలతో ఎగిసిపడింది.అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆపే ప్రయత్నం చేస్తోంది.
………………………………………………………