
* ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై అత్యాచారం
* ఆలస్యంగా వెలుగులోకి..
ఆకేరు న్యూస్ డెస్క్ : ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 32 ఏళ్ల మహిళపై ఆస్పత్రి నర్సింగ్ సిబ్బంది ఒకరు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాజస్థాన్ లో ఈ అమానుష ఘటన జరిగింది. ఈఎస్ ఐసీ మెడికల్ కాలేజీలో 32 ఏళ్ల ఓ మహిళ ఐసీయూలో చికిత్స పొందుతుండగా ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ లేనిది చూసి నర్సింగ్ సిబ్బంది ఒకరు ఎవరికీ కనడబకుండా మహిళ బెడ్ చుట్టూ ఉన్న కర్టెన్లు వేసి మహిళకు మత్తు మందు ఇచ్చిఈ అమానుషాని పాల్పడ్డాడు. అప్పటికీ బాధితురాలు కొంచెం స్పృహలో ఉన్నప్పటికిఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. అయితే బాధితురాలు స్పృహలోకివచ్చాక కుటుంబసభ్యలకు విషయాన్ని తెలియజేసింది.బాధితురాలి భర్త ఆస్పత్రి సిబ్బందిని నిలదీయగా వారు ఈ విషయాన్ని ఖండించారు దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాధిరాలి వాంగ్మూలం తీసుకున్నారు. సీసీఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొరి విచారిస్తున్నారు.
……………………………………………………