
* వాతావరణ శాఖ చల్లటి కబురు
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. న్కెరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురిశాయి. ప్రస్తుతం వర్షాలు ముఖం చాటేయడంతో.. మళ్లీ ఎండలు దంచికొడు తున్నాయి. భానుడు ప్రతాపం చూపుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాగల ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోవిరీటర్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర ఇంటీ-రియర్ కర్నాటక, తెలంగాణ విరీదుగా కోస్తా ఆంధ్ర వరకు సగటు- సముద్రమట్టానికి 1.5 కిలోవిరీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ద్రోణి బలపడిరదని పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్ కర్నాటక, పరిసర ప్రాంతాల్లో సగుట సముద్రమట్టానికి 3.1 కిలోవిరీటర్ల ఎత్తుల ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిరదని తెలిపింది. శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడిరచింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నాడు ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోవిరీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సోమవారం నాడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం నాడు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. బుధవారం నాడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
…………………………………………………