
* ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి
* బీఆర్ ఎస్ పార్టీలో విషాదం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీ ఆర్ ఎస్ సీనియర్ నేత మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అన్నారు.1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం ద్వారా మాగంటి రాజకీయ జీవితం ప్రారంభం అయింది. 1985 నుండి 1992 వరకు, ఆయన టిడిపి యువజన విభాగం తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత ఆయన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ డైరెక్టర్ గా పనిచేశారు. 2014లో ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీని వీడి బీఆర్ ఎస్ లో చేనరి 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థిగా జూబ్లీహఙల్స్ స్థానం నుంచి గెలిచారు. 2023 లో ఆయన మూడో సారి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2023 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ప్రముఖ క్రికెటర్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ పై 16వేల పై చిలుకు ఓట్లతో గెలిచారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడుగా మాగంటి గోపీనాధ్ ఎదిగారు. నియోజకవర్గంలో తనకు మంచి పట్టు ఉన్నదని నిరూపించుకున్న గోపీనాధ మరణం బీఆర్ ఎస్ పార్టీకి తీరని లోటని చెప్పవచ్చు.
………………………………………..