
* లారీని వెనకునుంచి ఢీకొన్న మరో లారీ
* వెనక లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్
* ప్రమాదంలో ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు
ఆకేరు న్యూస్ వనపర్తి : రెండు లారీలు, ఓ ప్రవేట్ ట్రావెల్ బస్సు ఒకదాని వెనుక ఢీకొన్న సంఘటలో ఒక వ్యక్తి మృతి చెందగా ఐదుగురు గాయపడ్డ సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా పెబ్బేర్ బైపాస్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. ఓ లారీని వెనుకనుంచి మరోలారి ఢీ కొట్టింది. వెనుకాల ఉన్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుకే వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ లారీని ఢీకొట్టగా ప్రమాదంలో బస్ క్లీనర్ మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
………………………………………………….