
* మత సామరస్యానికి ప్రతీక
* అలయ్ – బలయ్ పేరుతో అన్ని వర్గాలూ ఏకతాటిపైకి
* పార్టీలకు అతీతంగా తెలుగు జాతిని నంబర్ వన్లో నిలపాలి
* ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జంటిల్ మన్ కు ప్రతిరూపం దత్తాత్రేయ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (CHANDRABABU NAIDU) అన్నారు. దత్తాత్రేయది ఆదర్శ రాజకీయం అని కొనియాడారు. శిల్పారామంలో జరిగిన హరియాణ గవర్నర్ దత్తాత్రేయ (DATHATREYA) ఆటో బయోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తాత్రేయకు ఎవరూ శత్రవులు ఉండరని అన్నారు. ఆయన మత సామరస్యానికి ప్రతీక అన్నారు. అలయ్ బలయ్ (ALAY – BALAY) పేరుతో అన్ని వర్గాలనూ ఏకతాటిపైకి తెచ్చారని కొనియాడారు. దత్తాత్రేయను అందరూ దత్తన్న అని అభిమానంగా పిలుచుకుంటారని తెలిపారు. దత్తాత్రేయకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబందం ఉండదన్నారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారని, ఎంత ఎదిగినా హైదరాబాద్ అభివృద్దిని మరచిపోలేదని చెప్పారు. ప్రజా సమస్యలపై సీఎంలకు, ప్రభుత్వాలకు లేఖలు రాశారని వివరించారు. అజాత శత్రువు దత్తాత్రేయ అని, ఐకమత్యాన్ని కాపాడిన వ్యక్తి బండారు దత్తాత్రేయ అని తెలిపారు. ఆ ఐకమత్యంతోనే అందరూ కలిసి ముందుకు పోవాలన్నారు. తెలుగుజాతిని ప్రపంచంలో నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లడమే అందరి ఆలోచనా కావాలని ఆకాంక్షించారు. ఆర్థిక సంస్కరణలతో దేశం దశ, దిశ మార్చిన పీవీ నర్సింహారావు (PV NARSIMHARAO)ఈ గడ్డపై పుట్టిన వ్యక్తి అని గుర్తు చేశారు. శిల్పారామానికి వస్తే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని, తన హయాంలో చేసిన అభివృద్దిని మరోసారి తెలిపారు.
…………………………………………………..