
* మంత్రులుగా గడ్డం వివేక్,అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి
* కొత్త మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
ఆకేరు న్యస్ , హైదరాబాద్ : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు
తెరబడింది.. ఆదివారం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్త మంత్రులజే ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా మంత్రులుగా నియమించిన వారిలో చెన్నూరు ఎమ్మెల్య గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి,ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌లు ఉన్నారు. కొత్తగా ఎన్నికైన మంత్రుల్లో ఇద్దరు దళిత సమాజిక వర్గానికి చెందిన వారు కాగా ఇకరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. నిన్నటి వరకు ఆశావహుల్ల నిజామాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కోమటి రెడ్డ రాజగోపాల్ రెడ్డిల పేర్లు బలంగా వన్పించాయి. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు మంత్రి వర్గంలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిలకు మంత్రి పదవులు వరించాయి. మొత్తం ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో ప్రస్తుతానికి మూడు మంత్రి పదవులను భర్తీ చేశారు. ఎంపికైన మంత్రుల వివరాలు..
వాకిటి శ్రీహరి
కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వాకిటి ముదిరాజ్ 2001 నుండి 2006 వరకు మక్తల్ గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. 2014 నుంచి 18 వరకు మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు.2014 నుంచి 18 వరకు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.2022నుండి ఆయన నారాయణ పేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన బీఆర్ ఎస్ అభ్యర్థి చిట్టం రాంమోహన్ రెడ్డి పై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
గడ్డం వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ నాయకుడు అయిన గడ్డం వెంకటస్వామి కుమారుడిగా రాజకీయాల్లోకి గడ్డం వివేక్ ప్రవేశించారు.2009లో ఆయన పెద్దపెల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న నేపధ్యంలో ఆయన 2013లో కాంగ్రెస్ ను వీడి టీఆర్ ఎస్ పార్టీ అంటే ఇప్పడున్న బీ ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత వివేక్ మళ్లీ కాంగ్రెస్ చేరారు. ఆ తరువాత 2014లో కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి ఎంపీ సీటు తిరిగి కేటాయించగా బీ ఆర్ ఎస్ ప్రభంజనంలో వివేక్ ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2016లో బీఆర్ ఎస్ లో చేరి ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లీ తాను ఆశించినట్లుగా బీఆర్ ఎస్ సీటు రాకపోవడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి 2018లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా ,బీజేపీ మేని ఫెస్టో కమిటీ సభ్యుడిగా పనిచేశారు బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో ఆయన ఆయన బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు చెన్నూరులో ఆయన బీఆర్ ఎస్ నాయకుడు బాల్క సుమన్ ను ఓడించారు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1982 లో ఆయన గోదావరి ఖని జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986 నుండి 94 వరకు కరీంనగర్ జిల్లా ఎన్ ఎస్ యూ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు 1996 నుంచి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు 2006లో ధర్మారం రిజర్వుడ్ స్థానం నుంచి జెడ్పీటిసీగా గెలిచాడు.1999లో అసెంబ్లీకి మేడారం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2010 నుంచి 1012 వరకు కరీంనగర్ జెడ్పీ చైర్మన్ గా పని చేశారు. 2009 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ తరువాత జరిగిన 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ ఎస్ అభ్యర్థి కొప్పల ఈ శ్వర్ చేతిలో ఓడిపోయారు.2014 18లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాతజగిత్యా ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్లూ 2023లో జరిగిన శాసన సభ ఎన్నికల్లోధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి తన ప్రత్యర్థి బీఆర్ ఎస్ లో కీలక నాయకుడైన కొప్పుల ఈశ్వర్ పై విజయం సాధించారు ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు.
…………………………………………………………………