
* ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాజ్భవన్లో తెలంగాణ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయింది. మంత్రిగా జి.వెంకటస్వామి (G.VENKATA SWAMY)ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మపురి నియోజకవర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (LAXMAN KUMAR) కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఎన్ ఎస్యూఐతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. మక్తల్ నియోజకవర్గానికి చెందిన వాకిటి శ్రీహరి (VAKITI SRIHARI) కూడా మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో వీరి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
……………………………………