
* హాజరైన అతిరథ మహారథులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru dattatreya) ‘ఆటో బయోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ హైదరాబాద్ శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్(Ramnath covind), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkayya Naidu), ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు వీహెచ్, కేకే, సుప్రీంకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఒడిశా గవర్నర్ హరిబాబు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. నిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రస్తుత డైరెక్టర్ బీరప్ప, సీపీఐ నాయకులు నారాయణ తదితరులు కూడా విచ్చేశారు. పార్టీలకు అతీతంగా ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. దత్తాత్రేయతో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నారు. శత్రువులు, విరోధులు లేని మహనీయుడు దత్తాత్రేయ అని కొనియాడారు.
………………………………………