
* ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గిరిజనుల నినాదాలు
* ప్రైవేట్ పాఠశాల భవన ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే
* గిరిజనుల భూమిలో అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తున్న స్థానికులు
* చేసేదీ ఏమీ లేక వెనుదిరిగిన ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ డాక్టర్ మురళీ నాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్తవానిఇ వెళ్తున్న ఎమ్మెల్యేను స్థానిక గిరిజనులు అడ్డుకొని ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశౄరు. కారుకు అడ్డంగా నిలుచొని ఎమ్మెల్యే కారు ముందుకు కదలకుండా చేయడంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే అక్కడ నుంచి వెనుదిరిగారు.శనిగరం శివారు వీరారం తండాకు చెందిన గిరిజనులు సాగుచేసుకుంటున్న భూమిలో ఇటీవల ఓ ప్రైవేట్ పాఠశాల భవనాన్ని నిర్మించారు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా గిరిజనులు సాగుచేసుకుంటున్న భూమి కబ్జా చేశారని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా నిర్మించిన పాఠశాలకు ఎమ్మెల్యే ఎలా ప్రారంభిస్తారని గిరిజనులు నిలదీశారు. గిరిజనులకు అండా ఉండాల్సిన ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం సరికాదన్నారు ఎమ్మెల్యే ను పాఠశాల ప్రారంభించకుండా ఎమ్మెల్యే కారును అడ్డుకొని ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. స్థానిక సీఐ దేవెందర్ రూరల్ ఎస్సై దీపికా రెడ్డిలు గిరిజనులు శాంతింపచేయడానికి ప్రయత్నించినా గిరిజనులు ఒప్పుకోక పోవడంతో చేసేదిఏమీ లేక ఎమ్మెల్య మురళీ నాయక్ వెనక్కి వెళ్లిపోయారు.ఈ సందర్భంగా ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాజీ కౌన్సిలర్ భూక్య శ్రీను మాట్లాడుతూ దశాబ్ధాలుగా స్థానిక గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిలో ప్రైవేట్ వ్యక్తులు పాఠశాల భవనాన్ని నిర్మించారని వారు తెలిపారు. పట్టణ శివారులోని శనిగపురం రోడ్డులో నూతనంగా నిర్మించిన పాఠశాల ప్రారంభోత్సవానికి వెళుతున్న క్రమంలో గిరిజన రైతులు ఎమ్మెల్యే మురళీ నాయక్ వాహనాన్ని అడ్డుకున్నారు. గిరిజన భూములను ఆక్రమించి అనేక నిర్మాణాలు చేసి పాఠశాల నిర్మించి అదే పాఠశాలను ప్రారంభించడానికి వెళ్తున్నావా? అని ఎమ్మెల్యేను గిరిజన రైతులు నిలదీశారు. గిరిజన రైతులకు అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే నే అగ్రవర్ణానికి చెందిన వారికి సపోర్టుగా నిలవటం ఏమిటి అని ప్రశ్నించారు.
…………………………………………..