
* హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
* డోర్నకల్ లో సంబరాలు
ఆకేరు న్యూస్, డోర్నకల్ : గిరిజన బిడ్డకు డిప్యూటీ స్పీకర్ పదవి లభించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచందర్‌నాయక్‌ను శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. 2023 లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయిన రాంచంద్రునాయక్ ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో రాటుదేలి డోర్నకల్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న సీనియర్ లీడర్ రెడ్యానాయక్ ను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ అనుబంధ ఆరోగ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాంచందర్ నాయక్ 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్లు సర్పంచ్‌తండాకు చెందిన జాటోతు రాంచందర్‌నాయక్ ఉస్మానియా నుంచి ఎంబీబీఎ్‌సతో పాటు ఎంఎస్ సర్జన్ పట్టాలు పొందారు. సూర్యాపేటలో శివసాయి ఆస్పత్రి స్థాపించి, వైద్య సేవలందించారు. రాంచంద్రునాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి లభించంతో మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.
………………………………………………….