
* బీఆర్ ఎస్ పై కోపంతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారు
* ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది
ఆకేరున్యూస్ హైదరాబాద్ : విద్వేషంతో కాదు విజ్ఞతతో ఆలోచించాలని, వివేకంతో పనిచేయాలని
హరీష్ రావు కాం్రగెస్ నేతలకు హితవు పలికారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజయేందుకు వెళ్లిన హరీష్ రావు విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం పై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టింస్తోందని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోమని హరీష్ రావు హెచ్చరించారు.కాళేశ్వరంపై తమ వద్ద ఉన్న పూర్తి సమాచారాన్ని కమిషన్ కు వివరిస్తామని హరీష్ అన్నారు. తాము ఏ తప్పు చేయలేదని న్యాయం తమవైపే ఉందని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.
…………………………………………