
* హస్తినకు పయనమైన సీఎం రేవంత్ రెడ్డి
* శాఖల రీ షెడ్యూల్ చేయనున్నారా?
* కాసేపట్లో ప్రకటన?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఎట్టకేలకు మంత్రి వర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఎవరికి ఏ శాఖ ఇస్తారనేది సస్పెన్స్ గా ఉంది. ఈ క్రమంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY) హుటాహుటిన ఢిల్లీ(DELHI)కి పయనమయ్యారు. మంత్రుల శాఖలపై అధిష్ఠానంతో చర్చించనున్నారు. మంత్రులకు శాఖలు కేటాయిస్తూ అధికారికంగా ఈ రోజు ప్రకటన విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అధిష్ఠానం పెద్దలతో భేటీ కానున్నారు. ఖాళీగా ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయిస్తారా? లేదా కొందరు మంత్రుల శాఖలను రీ షెడ్యూల్ చేస్తారా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. దీనిపై ఈ రాత్రికి సమాధానాలు దొరికే అవకాశాలు ఉన్నాయి.
వీరికి ఈ శాఖలేనా?
ఇదిలాఉండగా కొత్త మంత్రుల శాఖలపై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. వీరికి ఈ శాఖలే అంటూ సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. గడ్డం వివేక్(GADDAM VIVEK) కు స్పోర్ట్స్ అండ్ యువజన సర్వీసులు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్(ADLURI LAXMAN KUMAR)కు లేబర్ అండ్ ఎస్సీ వెల్ఫేర్ శాఖ, వాకిటి శ్రీహరి(SRIHARI)కి న్యాయ, పశుసంవర్ధక శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోం, మున్సిపల్, విద్యా, కమర్షియల్ శాఖలతో పాటు వెల్ఫేర్ శాఖలు కేటాయిస్తారా? లేదా మంత్రుల శాఖల్లో మార్పు జరుగుతుందా? అనేది తేలాల్సి ఉంది.
……………………………………………