
Narendra modi visits Telangana
* సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్..
* ఎక్స్ లో ప్రధాని మోదీ ఆసక్తికర పోస్టు
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (MODI)సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన 11 ఏళ్ల పాలనపై ట్వీట్ చేశారు. 11 ఏళ్ల దేశ సేవకు గర్విస్తున్నా అన్నారు. సుపరిపాలనపై ఎన్డీఏ సర్కారు దృష్టి పెట్టిందని మోదీ అన్నారు. 11 ఏళ్ల పాలనలో విభిన్న రంగాల్లో అనేక మార్పులు వచ్చాయన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్.. మా ఎన్డీఏ సూత్రం.. అదే లక్ష్యంతో ముందుకు వెళ్తామని మోదీ స్పష్టం చేశారు. పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. సమష్ఠి విజయం పట్ల గర్విస్తున్నా.. వికసిత్ భారత్ (VIKASITH BHARATH) నిర్మాణానికి ముందుకెళ్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు #11YearsOfSeva హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. కాగా, గత ఏడాది జూన్ 9న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘వికసిత్ భారత్‌కా అమృత్ కాల్’ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం (CENTRAL GOVERNMENT) నిర్వహిస్తోంది. ప్రధానిగా 11 ఏళ్ల పాలనపై నరేంద్ర మోదీ సోమవారం ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
……………………………………………….