
* ముగిసిన కేసీఆర్ విచారణ
* 50 నిమిషాలు కొనసాగిన విచారణ
* విచారణ అనంతరం యశోదాకు బయలుదేరిన కేసీఆర్
* జనగాం ఎమ్మెల్యే పల్లాను పరామర్శించనున్న కేసీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రీ కేసీఆర్ యశోదా ఆస్పత్రికి వెళ్లనున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యాందుకు సిద్దిపేట ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి నేరుగా హైదరాబాద్ లోని బీఆర్కే భవన్కు చేరుకున్న కేసీఆర్ బీఆర్కే భవన్లో జస్టిస్ పీకే ఘోష్ కమిషన ముందు హాజరయ్యారు. ఘోష్ కమిషన్ కేసీఆర్ ను దాదాపు 50 నిమిషాలు విచారించింది. ఈ నేపధ్యంలో కేసీ ఆర్ కమిషన్ అడిగిన పలుప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు సమచారం. కొన్ని డాక్యుమెంట్లను కూడా కమిషన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ము ందుగా ఓపెన్ కోర్టులో విచారణ జరుగుతుందని భావించారు కానీ తనకు జలుబు ఉందనికేసీఆర్ కమిషన్ కు తెలిచజేయడంతో విచారణను ఓపెన్ కోర్టులో కాకుండా ఇండోర్ లో విచారించింది. ఇదిలా ఉండగా ఫాం హౌజ్ లో కేసీఆర్ ను కలిసేందుకు వెళ్లిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫాం హౌజ్ లో ప్రమాదవశాత్తు కాలుజారి పడడంతో పల్లా తుంటి ఎముకకు గాయం అయింది. గాయపడ్డ పల్లాను హైదరాబాద్ లోని యశోధా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బీఆర్కే భవన్లో కళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ ముగించుకున్న కేసీఆర్ పల్లాను పరామర్శించడానికి యశోధా ఆస్పత్రికి వెళ్లారు.
……………………………………………..