
* విచ్చలవిడి పార్టీల నేపథ్యంలో తెలంగాణ పోలీసు హెచ్చరిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చట్టాలను ధిక్కరించి ఎలా పడితే అలా ఉంటామని చూస్తూ ఊరుకోబోమని, లాఠీలు ఝులిపించి గాడిన పెడతామని తెలంగాణ పోలీసులు ఎక్స్ లో చేసిన పోస్టు వైరల్ మారింది. మంగళవారం రాత్రి సింగర్ మంగ్లీ (Mangli) పుట్టినరోజు వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి భారీగా లభ్యమైన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని ఓ రిసార్టులో జరుగుతున్న మంగ్లీ బర్త్‌డే పార్టీపై రాత్రి 2 గంటల సమయంలో చేవెళ్ల పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో సింగర్ మంగ్లీ, పార్టీ నిర్వాహకుడు, రిసార్ట్ నిర్వాహకుడు, గంజాయి పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఈరోజు తెలంగాణ పోలీస్ (Telangana Police) తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ పెట్టింది. చట్టాలను ధిక్కరించి ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేసింది. అలా చేస్తే లాఠీలు ఝుళిపించి గాడిన పెడతామని పేర్కొంది. ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్ లాంటి మత్తుపదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. రిసార్ట్‌లో చేవెళ్ల పోలీసులు దాడి చేసిన దృశ్యాలను షేర్ చేసింది. ఈ పోస్టు వైరల్ గా మారింది.
………………………………….