
* ఆకట్టుకున్న తమ్ముడు ట్రైలర్
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ” మీ అక్కను చూశావా.. తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ, కేరెక్టర్ మాత్రం మిస్ కాలేదు..” అనే డైలాగుతో మొదలైన తమ్ముడు ట్రైలర్ (Tammudu Trailor) ఆకట్టుకుంది. ఎమోషన్.. యాక్షన్.. ఫ్యామిలీ డ్రామా సంయుక్తంగా ఈ ట్రైలర్ లోనే చూపించారు దర్శకుడు. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీరాము వేణు (Sri ram Venu) నుంచి వస్తున్న మరో సినిమా ఇంది. ఇందులో నితిన్ (Nitin) హీరోగా నటిస్తుండగా, లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. లయ, నితిన్ అక్కాతమ్ముళ్లుగా నటించారు. అక్కకు ఇచ్చిన మాట నిలబెట్టే తమ్ముడి కథగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతోంది. ” మాట పోయి మనిషి బతికినా, మనిషి పోయినట్లే లెక్క. మాట బతికి మనిషి పోతే, మనిషి బతికి ఉన్నట్టే లెక్క” వంటి డైలాగులు ఆకట్టుకున్నాయి. విజువల్స్, సంగీతం ప్రేక్షకులను అలరిస్తాయి. జూలై 4న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
……………………………………….