
ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాలలో గల కేశవాపూర్ రోడ్డు నుంచి వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిని కొందరు ఆక్రమించి ఇంటి కాంపౌండ్ గోడ నిర్మాణం చేపడుతుండటంతో వ్యవసావానికి వెళ్ళే బాట కబ్జాకు గురైందని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.గ్రామానికి చెందిన కొందరు బాటను కబ్జా చేసి అక్రమంగా ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నారని, దీంతో కేశపూర్ రోడ్డు గుండా పంట పొలాలకు వెళ్లే రైతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బాట కబ్జాతో దారి చిన్నది అయ్యి ట్రాక్టర్లు, వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారు. వెంటనే దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని రైతులు కలెక్టర్ ను కోరారు.
……………………………………………..