
* మంత్రి సీతక్క
తాడ్వాయి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క
ఆకేరున్యూస్, తాడ్వాయి : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే దేశంలోని అణగారిన వర్గాలకు రాజ్యాంగ పదవులు దక్కాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం తాడ్వాయి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత గిరిజన ఆదివాసి నాయకుల అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క అనంతరం జరిగిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతు మహానుభావుని విగ్రహావిష్కరణ ఈ రోజు తన చేతుల మీదుగా నేడు తాడ్వాయి మండల కేంద్రములో ఆవిష్కరించడం సంతోషంగా ఉందని రాజ్యాంగ ఫలాలు పేద బడుగు, బలహీన వర్గాలకు దక్కేలా చేసిన అంబేద్కర్ విగ్రహాలను గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. జిల్లా, మండల అంబేద్కర్ యువజన సంఘాల సహకారంతో నేడు అంగరంగ వైభవంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసుకోవడం సంతోషానిచ్చిందని మంత్రి సీతక్క నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంధాలయం సంస్థ చైర్మన్ రియాజ్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు దళిత ఆదివాసి గిరిజన రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………..