
* యోగా అక్షర రూపంలో చిన్నారులు
* ఆకట్టుకున్న విన్యాసం
ఆకేరు న్యూస్, జనగామ: ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులు వేసిన డిజైన్ చూపరులను కట్టిపడేసింది. పాలకుర్తిలోని సుధ హై స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో చిన్నారులు విశేష ప్రతిభ కనబరిచారు. చిన్నారులు యోగ అనే అక్షర క్రమంలో కూర్చొని అందరి దృష్టిని ఆకర్శించారు. అలాగే యోగ వలన కలిగే లాభాలను, మానసిక శారీరక అభ్యున్నతికి ఎలా ఉపయోగ పడుతుందో వివరించారు. శనివారం జరిగే యోగ ప్రత్యేక కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా స్కూల్ కరస్పాండెంట్ రాపాక విజయ్ తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
………………………………………..