* కేసీఆర్, కేటీఆర్ లను కాపాడే ప్రయత్నం
* హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్
* కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (BANDI SANJAY) తెలిపారు. ప్రభాకర్ రావు చాలా మంది జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS) నేతలు.. వారి భార్యల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. బీఆర్ ఎస్ పాలనలో ఫేస్ టైం, సిగ్నల్ యాప్‌లోనే మాట్లాడుకునే వాళ్లమని వెల్లడించారు. ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వాలని సిట్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ఒకటి, రెండు రోజుల్లో తేదీ చెబుతానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (CONGRESS GOVERNMENT) ప్రభాకర్ అండ్ కోను కాపాడుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. పెద్దాయన ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు అంగీకరించారని, అయినా కేటీఆర్(KTR), కేసీఆర్(KCR) లకు నోటీసులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వారిని కాపాడే ప్రయత్నం చేస్తోందని, కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం ఉందని తెలిపారు. ప్రభాకర్ రావు భారత్ కు వచ్చే ముందు, కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్లారని అన్నారు. పేపర్ లీక్ కేసులో ప్రభాకర్ ఆదేశాలతోనే తనను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారని వివరించారు. జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
…………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
