
* కృష్ణునిగా చేయాలని ఉంది
* బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మనోగతం
ఆకేరు న్యూస్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కు ఓ ప్రత్యేకత ఉంది. కమర్షియల్ సినిమాలే కాకుండా వైవిద్యమైన చిత్రాలకు వైవిద్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తాడు. చాలా మంది నటులు రొటీన్ గా నటిస్తారు కాని కొంత మంది నటులు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించే పాత్రల్లో నటించేందుకు ప్రాధాన్యతనిస్తారు. ఇలాంటి వాటిలో కమల్ హాసన్ పెట్టంది పేరుకాగా అమీర్ ఖాన్ కూడా అదే కోవలోకి వస్తాడు. ఆయన నటించిన చాలా సినిమాలు రొటీన్ కు భిన్నంగా వైవిద్యంగా ఉంటాయి. ప్రయోగాత్మక సినిమాల్లో నటించడం అమీర్ కు ఇష్టం . తాజాగా అమీర్ ఖాన్ త\న అంతరంగాన్ని బయట పెట్టాడు. అమీర్ ఖాన్ కు శ్రీకృష్ణుని పాత్రలో నటించాలని ఉందట.. శ్రీకృష్ణుని క్యారెక్టర్ తనను ప్రభావితం చేసిందని అంటున్నాడు. మహాభారతాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాను అంటున్నాడు. ఒకే సినిమాలో కృష్ణుని పాత్రను చూపించలేమని దీన్ని సిరీస్ గా తీసే యోచనలో ఉన్నానని అమీర్ అంటున్నాడు. ఈ సిరీస్ తో భారత దేశ గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుందని అంటున్నాడు. నిజంగా ఈ డ్రీం ప్రాజెక్ట్ తెరకెక్కితే మతం పేరుతో వైశమ్యాలు సృష్టిస్తున్న వారి నోర్లు మూతపడతాయని చెప్పవచ్చు.. భారతదేశం అంటే వసుధైక కుటుంబం అని భిన్నత్వంలో ఏకత్వమే దేశ ప్రత్యేకత అని చాటి చెప్పినట్లు అవుతుంది. అన్నట్లు అమీర్ నటించిన మిస్టర్ పర్ ఫెక్ట్ త్వరలో ప్రేక్షకుల మందుకు రాబోతోంది.. వైవిద్యాన్ని కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఎలా ఉంటుందో చూడాలి మరి..
…………………………………………………