
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : ఫుడ్ పాయిజన్ కు గురై
విద్యార్థినులు ఆస్పత్రి పాలైన సంఘటన మహబూబాద్లో
జరిగింది. జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో చదువుతున్న
విద్యార్థినులు రోజువారీ లాగానే ఆదివారం మొలకలు తిన్నారు
వాటిని తిన్న కాసేపటికే 17 మంది విద్యార్థినులు అస్వస్థతకు
గురయ్యారు.కడుపు నొప్పి వాంతులు రావడంతో విద్యార్థినులను
స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులను
పరీక్షించిన డాక్టర్లు విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కు
గురైనట్లుగా నిర్ధారించి చికిత్సనందిస్తున్నారు. విద్యార్థినుల
పరిస్థితి నిలకడగా ఉంది.
………………………………………..