
* కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం,బత్తుల లక్ష్మారెడ్డి,కుంభం అనిల్ రెడ్డి,మందల సామెల్ , ఎమ్మెల్సీలు శంకర్ నాయక్,సత్యం
ఆకేరు న్యూస్ నల్గొండ ః నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం,బత్తుల లక్ష్మారెడ్డి,కుంభం అనిల్ రెడ్డి,మందల సామెల్ , ఎమ్మెల్సీలు శంకర్ నాయక్,సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి పని చేస్తే ప్రజల ఆశీర్వాదం ఎలా ఉంటుందో కార్యక్రమానికి వచ్చిన జనాలనుచూస్తే అర్థంఅవుతోందని అన్నారు.గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి డబుల్ బెడ్ రూంలు కాదు కదా సింగిల్ బెడ్ రూంలను కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులం,మతం అని చూడకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తోందని అన్నారు. రాబోయే మూడేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలనేదే ప్రభుత్వ సంకల్పం అని అన్నారు. గత ప్రభుత్వంలో ధరణిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములను, పేదల భూములను బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ఆక్రమించుకొని రైతు బంధు పొందారని అన్నారు. తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని నేతలు అన్నారు. ఓ ఆరడగుల అందగాడు, మాజీ మంత్రి ఓ దగ్గర చేస్తున్న ధర్నాలో రప్పా.. రప్పా.. అని ఉన్న ఫెక్లీలు, ప్లకార్డులు ప్రదర్శించారు. ఏంటీ రప్పా.. రప్పా..? ఇంకా ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు.? ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలనుకుంటున్నారా.? అని మాజీ మంత్రి హరీష్ రావునుద్దేశించి కాం్రెస్ నాయకులు మాట్లాడారు. గోదావరి నది నుంచి పెన్నా బేసిన్ లోకి 400 టీఎంసీల నీటిని ఇచ్చేందుకు 2016 లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తో ఒప్పందం చేసుకొని జీవో జారీ చేసింది మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా.? అని నేతలు ప్రశ్నించారు. బనకచర్ల బంకను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గంలో మూడు కొత్త ఎమ్మర్వో కార్యాలయాల భవన నిర్మాణాలకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
……………………………………….