
* ములుగు జిల్లా కలెక్టర్ దివాకర
ఆకేరు న్యూస్, ములుగు : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి లతో కలిసి జిల్లా కలెక్టరు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణి ఆశ్రయిస్తున్నారని, వారి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, ప్రజావాణి పోర్టల్ లోని పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణి లో 56 దరఖాస్తులు వచ్చాయి.ఇందులో అత్యధికంగా భూ సమస్యలు 23, గృహ నిర్మాణ శాఖకు 15, ఉపాధి కల్పనకు 01, పెన్షన్ 02, ఇతర శాఖలకు సంబంధించినవి 15 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సమావేశ మందిరంలోనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి, పర్యవేక్షకులు, తహసీల్దార్లు, ఎం పి డి ఓ లు, ఎంపిఓ లు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………