
* హైదరాబాద్లో భారీ వర్షం
* పలు ప్రాంతాలు జలమయం
* రాకపోకలకు తీవ్ర ఇబ్బందుల
* విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఆకేరున్యూస్ హైదరాబాద్ : రానున్న మూడు రోజులు భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళా ఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపధ్యంలో తెలంగాణ తో పాటు ఏపీలో కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా నిన్న హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్,నారాయణ గూడ. జూబ్లీహిల్స్,పంజాగుట్ట ,లక్డికాపూల్,మలక్ పేట్, షేక్ పేట్ మణికొండ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి ఈ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
………………………………………………………