
ఆకేరున్యూస్ బాలానగర్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా దర్యాప్తు కోసం వెళ్లిన పోలీసులకు డీసీఎం వ్యాన్ ఢీ కొట్టిన ఘటన హైదరాబాద్ బాలానగర్ లో చోటుచేసుకుంది. బాలానగర్ ప్లైఓవర్‌పై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఓ కారు ఢీకొనగా ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు .సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకి చేరుకొని దర్యాప్తు చేస్తుండగా ఓ డీసీఎం వ్యాన్ వచ్చి దర్యాప్తు చేస్తున్న పోలీసులను ఢీకొట్టింది.ఈ ఘటనలో ఎస్సై వెంకటేశం తీవ్రంగా గాయపడగా ఆయననుఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యక్తి మృతికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులను ఢీ కొట్టిన డీసీఎం డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
…………………………………..