
* ఐదుగురు మృతి .. పలువురికి గాయాలు
ఆకేరున్యూస్ డెస్క్ : తమిళనాడులోని శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు సంభవించడంతో కర్మాగారంలో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మృతుల్లో ఓ మహిళ ఉంది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక బృందం మంటలను ఆర్పే పనిలో ఉంది.
…………………………………..