
* ప్రమాదం జరిగిన తీరును పరిశీలించిన సీఎం
* ఘటనపై అధికారులతో సమీక్షించిన సీఎ
ఆకేరు న్యూస్, పటాన్ చెరు : సీఎం రేవంత్ రెడ్డి పాశమైలారంలో పేలుడు సంభవించిన సిగాచి ఫ్యాక్టరీని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును ప్రమాదానికి గల కారణాలపై సీఎం ఆరా తీశారు. ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలొ ఏమైనా ప్రమాదాలు జరిగాయా అని అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీలో శిక్షణ పొందిన కార్మికులే పని చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఏ ప్రాతిపదికన కార్మికులను తీసుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఎంత మంది పని చేస్తున్నారు. తెలంగాణ వారు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు.బోర్డు సభ్యులు ఎంత మంది వారి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారని అధికారులను అడిగితెలుసుకున్నారు. ప్రమాదంపై నిపుణులతో తనిఖీ చేయించాలని కోరారు. ఇంతకు మందు తనిఖీ చేయించిన వారితో కాకుండా కొత్త వారితో తనిఖీ చేయించి నివేదిక సమర్పించాలని కోరారు. ఇతర పరిశ్రమలో ఇలాంటి సమస్యలు భవిష్యత్ లో రాకుండా ఉండాలంటే పాశమైలవరం ఘటనపై దానికి గల కారణాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోరారు. ఇక ముందు ఇలాంటి సమస్యలు రాకూడదు అని సీఎం అన్నారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలిస్తే ఇక ముందు ఇలాంటి వి జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్నారు.ప్రభుత్వ పరంగా సహాయం చేయాలంటే పరిశ్రమ అధికారులు పూర్తి సమాచారం అందించాలని కోరారు. చనిపోయిన వారికి ఎంత ఎక్స్గ్రేషియా చెల్లించాలనేదానిపై అధికారులు సూచనలు కావాలని కోరారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి భవిష్యత్ లో పనిచేయలేని వారి గురించి ఆలోచించాలని సీఎం అన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,వివేక్ వెంకటస్వామి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.
……………………………………………….