
* తీవ్రంగా గాయపడిన వారికి పది లక్షలు
* స్వల్పంగా గాయ పడిన వారికి ఐదు లక్షలు
* ప్రమాదస్థలిని పరిశీలించి బాధితులతో మాట్లాడిన సీఎం
ఆకేరున్యూస్, పటాన్చెరు : పాశమైలవరం సిగాచీ రసాయన ఫరిశ్రమలో పేలుడు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. అలాగే తీవ్రంగా గాయపడ్డ వారికి భవిష్యత్ లో పనిచేసుకోలేని స్థితిలో ఉన్న వారి కుటుంబాలకు పది లక్షల చొప్పన అందిస్తామన్నారు. స్వల్పంగా గాయపడ్డ వారికి ఐదు లక్షలు అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితుల పిల్ల చదువుల బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని.. మృతదేహాలను సొంత గ్రామాలు తరలించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.పాశమూలవరంలో ప్రమాదానికి గురైన సిగాచీ కంపెనీని సందర్శించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు.రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున్న ప్రమాదం జరుగడం ఇదే మొదటి సారి అని సీఎం రేవంత్ అన్నారు. పరిశ్రమల పనితీరుపై ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అన్నారు. పరిశ్రమలకు సూచనలు ఇవ్వడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశ్రమలు సూచనలు పాటించేలా పర్యవేక్షించే అధికారం ఆ వ్యవస్థకే ఉండాలన్నారు. బాధితుల పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మృతదేహాలను వారి వారి స్వగ్రామాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
……………………………….