
* రూ.1.42 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆకేరు న్యూస్ ములుగు ః ములుగు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సీజీఎఫ్ నిధుల నుంచి రూ.1.42 కోట్లు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.గోవిందరావు పేట మండలం బుస్సాపూర్ జానకి రామాలయానికి రూ.12 లక్షలు, కొత్తగూడ మండలం గుంజేడు లోని ముసలమ్మ ఆలయానికి రూ. 50 లక్షలు ములుగు మండలం జగ్గన్నపేట పుట్టా మల్లిఖార్జున స్వామి దేవాలయానికి రూ.30 లక్షలు, మల్లంపల్లి లోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రూ.20 లక్షలు, ములుగు పట్టణంలోని నాగేశ్వర స్వామి దేవాలయానికి రూ.20 లక్షలు, రామాలయానికి రూ.10 లక్షలు మంజురు అయ్యాయి.త్వరలో టెండర్లు పిలిచి అభివృద్ది పనులు అధికారులకు అప్పగించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క నిధుల మంజూరునకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు.
……………………………………………………