* జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవ రావు
ఆకేరు న్యూస్ తాడ్వాయిః మండలంలోని రైతులందరూ సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ ఫామ్ మొక్కలు సాగు చేయాలని జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవరావు అన్నారు . మంగళవారం నార్లపూర్ రైతు వేదిక లో వ్యవసాయ విస్తీర్ణ అధికారి రాజకుమార్ ఆధ్వర్యంలో జరిగిన రైతు సమావేశంలో జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవ రావు మాట్లాడుతూ రైతులు పూలు, పండ్ల తోటల తో అధిక ఆదాయం పొందాలని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందిస్తున్నా సబ్సిడీ లు ఉపయోగించుకోవాలన్నారు. ఉద్యానవన పంటలకు సంబంధించిన కరపత్రాలను ఈ విడుదల చేశారు.కార్యక్రమం లో తాడ్వాయి హార్టికల్చర్ అధికారి శ్రీకాంత్ ,మాజీ సర్పంచ్ బాబురావు, చెర్ప రవీందర్, సిద్దబోయిన అరుణ్ ,శ్రీను, చర్ప వీరమోహన్ రావు,వెంకట్ రామ్ రెడ్డి నార్లాపురం ఊరటం కొత్తూరు కన్నెపల్లి తదితర గ్రామాల రైతులు మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………….
