* ఏబీవీపీలో ఉన్నప్పుడే ఎన్నో పోరాటాలు చేశాను
* విపక్షాలకు బీజేపీ చీఫ్ మాస్ వార్నింగ్
* అఫీషియల్ ప్రకటన : రామచందర్ రావు ఎన్నిక ఏకగీవ్రం..
* సన్మానసభకు కేంద్ర మంత్రులు, భారీగా బీజేపీ నేతలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నేను మీరు అనుకున్నంత సాఫ్ట్ కాదని, యుద్ధంలో దిగితే యోధుడినేనని తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ ఎన్.రామచంద్రరావు విపక్షాలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏబీవీపీలో ఉన్నప్పుడే ఎన్నో పోరాటాలు చేసి, 13 సార్లు జైలుకు వెళ్లానని వెల్లడించారు. కాషాయం పార్టీ తెలంగాణ అధిపతిగా పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు (RAMACHANDER RAO) ఎన్నిక ఏకగ్రీవమైంది. సంస్థాగత ఎన్నికల అధికారి శోభ కరండ్లాజే ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు పార్టీ మన్నగూడ(MANNAGUDA)లో సన్మానసభ ఏర్పాటు చేసింది. ఈ సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు సభకు హాజరయ్యారు. ర్యాలీగా కార్యకర్తలతో కలిసి వేద కన్వెన్షన్ కు చేరుకున్న నూతన అధ్యక్షుడు రాంచందర్ రావుకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(KISHANREDDY), బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ తాను రాష్ట్ర అధ్యక్షుడిని అయినా, బీజేపీ కార్యకర్తనే అని తెలిపారు. అందరం కలిసికట్టుగా పార్టీని అధికారంలోకి తెస్తామని ప్రకటించారు.
……………………………………………..
