
* బాధితులను పరామర్శించిన ఎంపీ ఈటల, మాజీ మంత్రి నిరంజన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కల్తీ కల్లు ఘటనపై రాజకీయ పక్షాలు స్పందిస్తున్నాయి. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతారాం అనే వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. నిమ్స్ ఆస్పత్రిలో మొత్తం 19 మందికి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరికి వెంటిలేటర్ పై చికిత్స అందుతోంది. మిగతా వారు అందరూ వాంతులు, విరోచనాలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉదాసీనతకు కల్తీ కల్లు ఘటన కారణమని అన్నారు. మాజీ మంత్రి నిరంజన్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ పరిస్థితి గంభీరంగా ఉందని, ప్రభుత్వం లెక్కలు దాస్తోందని ఆరోపించారు. కల్తీ కల్లు ఘటనపై మాజీ మంత్రి నిరంజన్ మాట్లాడుతూ బాధితుల్లో కొందరి పరిస్థితి బాగోలేదని అన్నారు.
…………………………………………..