
ఆకేరు న్యూస్, ములుగు : ములుగు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా రేగ కళ్యాణి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనుసరి అనసూయ సీతక్క నేతృత్వంలో కళ్యాణి తో పాటు 11 మంది సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇందులో డైరెక్టర్లుగా సేద సారంగం, రసపుత్ సీతారాం, కొమురం బాలయ్య ,లక్కీ వెంకన్న ,ముక్తి రామస్వామి ,చెరప పగడయ్య ,పోరిక ప్రమీల ,పాలకుర్తి సమ్మయ్య ,ఆరేం వెంకన్న,ఆలోత్ దేవ్ సింగ్, పెద్ది రాజకుమార్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు .చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన రేగ కళ్యాణి మాట్లాడుతూ ములుగు జిల్లా వ్యాప్తంగా తనకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు .తాను ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు బాధ్యతగా అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ తోపాటు ములుగు వెంకటాపూర్ గోవిందరావుపేట తాడువాయి ఏటూర్ నాగారం కన్నాయిగూడెం వాజేడు వెంకటాపూర్ మంగపేట తదితర మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………..