
ఆకేరు న్యూస్, ములుగు: మలుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో బుధవారం జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మంత్రి సీతక్కను ఆమె జన్మదినం ను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .అలాగే ములుగు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన రేగ కళ్యాణి నీ మంత్రి సీతక్కను గజమాల తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండల అధ్యక్షులు దేవేందర్ ముదిరాజ్, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అరెం లచ్చు పటేల్, మాజీ సర్పంచ్, ఇర్ప సునీల్ మాజీ బ్లాక్ అధ్యక్షుడు ముజాపర్ హుస్సేన్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పాక సాంబయ్య , యానాల సిద్ది రెడ్డి, గంట సాయి రెడ్డి. తదితరులు ఘనంగా సన్మానించారు.
…………………………………………….