
* 70 ఏళ్లలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత
* పాఠశాలల బంద్
* పెరిగిన ఏసీల అమ్మకాలు
* ఫ్యాన్లకు పనితగిలింది
* ఏసీ, కూలర్ల మెకానిక్ లకు పని దొరికింది
* ఎండ వేడికి దెబ్బతింటున్న పండ్ల తోటలు
* నష్టపోతున్న పండ్ల తోటల యజమానులు
ఆకేరు న్యూస్ డెస్క్ : అతి శీతలమైను హిమాలయ పర్వత శ్రేణి అడుగున ఉండే కాశ్మీరం
ఇప్పుడు వేడెక్కుతోంది. కనివినీ ఎరుగని రీతిలో కశ్మీర్ లో వాతావరణ మార్పులు వస్తున్నాయి , భూతల స్వర్గంగా పిలువబడే కశ్మీర్ కు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి కాస్త సేదదీరడానికి , ఆహ్లాదంగా గడపడానికి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కాశ్మీర్ లో కన్పించడం లేదు. మామూలుగా కశ్మీర్ లో జులై నెల అత్యంత వేడిగా ఉంటుంది, సగటున 6 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 32 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు జులై నెలలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. కాశ్మీర్ లో అత్యంత చలిగా ఉండేది డిసెంబర్ నుండి జనవరి వరకు.. ఈ రెండు నెలల్లో కనిష్ట ఉష్ణోగ్రత -15 డిగ్రీల సెంటిగ్రేడ్ గా నమోదవుతుంది. గరిష్ట ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటిగ్రేడ్ గా ఉంటుంది. సంవత్సరానికి సగటున 2853 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది.
70 ఏళ్ల తరువాత..
గత 70 ఏళ్లలో శ్రీనగర్లో జులై నెల అత్యంత వేడిగా ఉంది. గత శనివారం, శ్రీనగర్లో 70 ఏళ్లలో అత్యధికంగా 37.4 సెంటిగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఇంతకు మందు పహల్గాంలో 31.6 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణాగ్రత నమోదయింది. 1978 లో ఇకసారి ఇంతే ఉష్ణోగ్రత నమోదయినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఇన్ని ఏళ్లు తరువాత మళ్లీ ఉష్ణోగ్రతలో పెరుగుదల కన్పించిందంటే కాశ్మీర్ లో ఇది అసాధారణ పరిణామంగా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కాశ్మీర్లో సగటు ఉష్ణోగ్రత ఏడాది పొడవునా మారుతూ ఉంటుంది, చల్లని శీతాకాలాలు మరియు తేలికపాటి వేసవికాలం ఉంటుంది. , శీతాకాలంలో (నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు), ఉష్ణోగ్రతలు -2°C నుండి 12°C వరకు ఉంటాయి. కాశ్మీర్ ను సందర్శించాలంటే నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు అనుకూలంగా ఉంటుంది.
ఏసీలకు, కూలర్లకు పెరిగిన గిరాకీ
శ్రీనగర్, అనంత్ నాగ్, బారాముల్లా ,కుల్గాంలాంటి ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ షాపులు జనాలతో కిటకిటలాడుతున్నాయి. సాధారణంగా కశ్మీర్ ఊటీ లాంటి ప్రాంతాల్లో ఏసీల విక్రయాలు కూలర్ల విక్రయాలు ఉండవు, కానీ అసాధారణ పరిస్థితులు వస్తున్నాయి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కాశ్మీరీలు చల్లని ఉపకరణాలు కొనుక్కోవడాని పరుగులు తీస్తున్నారు. ఇంతకు మందు లేని విధంగా ఏసీలు కూలర్ల షాపుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. దీంతో షాపు యజమానులు స్టాక్ సరిపోవడంలేదని మళ్లీ దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. అడపా దడపా పోయే వస్తువులకు ఇలా గిరాకీ పెరుగుతుందనుకోలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 60 శాతం గిరాకీ పెరిగిందని స్థానిక డీలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అలాగే ఏసీ మెకానిక్లు కూలర్ మెకానిక్ లకు చేతినిండా పని దొరుకుతోందట.
దెబ్బతింటున్న పండ్ల తోటలు
కాశ్మీర్ అంటేనే పండ్ల తోటలకు ప్రసిద్ధి చల్లని వాతావరణంలో పండే పండ్లకు కాశ్మీర్ ప్రసిద్ది.
కాశ్మీర్లో ఆపిల్స్, బేరి, చెర్రీస్, ఆప్రికాట్లు ఎక్కువగా పండిస్తారు. బాదం, వాల్ నట్స్,పిస్తా పప్పులు అంజూర పండ్లకు కూడా కశ్మీర్ ప్రసిద్ధి. అయితే చల్లని వాతావరణంలో పండే బేరి,చెర్రిస్ లాంటి పండ్లతోటలు వేడికి నష్టపోతున్నాయటి. పండ్లు దెబ్బతింటున్నాయి దీంతో వాతావరణంలో పెరిగిన వేడి వల్ల పండ్ల తోటల యజమానులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
………………………………………………..