
ఆకేరు న్యూస్ , కమలాపూర్: కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎం.పీ,బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం కమలాపూర్ మండల కేంద్రంలో ఈటెల స్వగృహంలో ,బిజెపి మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేశారు. భవిష్యత్తులో బండి సంజయ్ అత్యున్నత పదవులు పొంది కరీంనగర్ పార్లమెంట్ తో పాటు దేశ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని ఆకాంక్షించారు.మండలంలోని ఆస్పత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు కట్కూరి అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ చెలిక శ్రీనివాస్,భూపతి ప్రవీణ్, తుమ్మ శోభన్ బాబు, బండి కోటేశ్వర్, ఎండి రాజ్ మహమ్మద్, ఇనుగాల రత్నాకర్, జక్కుల రమేష్, పోలోజు రాజేశం, గొర్రె మధుసూదన్ రెడ్డి,చేరాల రాంబాబు, చెరిపల్లి రతన్ కుమార్, బోయిని సుభాష్, రాజేశ్వర్ రావు,అకినపెల్లి రవీందర్, రామారావు,బుర్ర కుమారస్వామి, చెట్టి సుందరయ్య,శనిగరపు సంపత్, మేడిపల్లి రాజు,పిసాల రవీందర్, మేకల ఓదెలు, గుర్రం సురేష్, పుస్కూరి రాంబాబు, రావుల ఆకాష్, తోట రాంప్రసాద్, రఘు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
………………………………………….